సౌదీలో ఇసుక తుపాను.. అంతరిక్షం నుంచి ఇలా..

యూఏఈ, ఖతార్‌, సౌదీ అరేబియా ప్రాంతాల్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ ఇసుక తుపాను అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను అమెరికా వ్యోమగామి డగ్‌ హర్లీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నుంచి క్లిక్‌మనిపించారు.

Updated : 30 Jun 2020 12:30 IST

ఖతార్‌ : యూఏఈ, ఖతార్‌, సౌదీ అరేబియా ప్రాంతాల్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ ఇసుక తుపాను అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను అమెరికా వ్యోమగామి డగ్‌ హర్లీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి క్లిక్‌మనిపించారు.

ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో ఉన్న హర్లీ.. ఈ ఇసుక తుపానుకు సంబంధించిన చిత్రాలను ట్వీట్‌ చేశారు. సహారా ఎడారి నుంచి ఓ భారీ దుమ్ము తుపాను అమెరికాలోని పలు ప్రాంతాలకు వ్యాపించింది. దాదాపు 8 వేల కి.మీలకుపైగా ప్రయాణించి శనివారం అక్కడికి చేరుకుంది. అంతకుముందు హర్లీ పశ్చిమ-మధ్య అట్లాంటిక్‌లోని సహారన్‌ దుమ్ము తుపానుకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని