భారత్‌కు మద్దతు తెలిపిన ఫ్రాన్స్‌

వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనాతో ముఖాముఖిలో భారతీయ సైనికుల మృతిపట్ల ఫ్రాన్స్ తీవ్ర సంఘీభావం వ్యక్తం చేసింది. భారత్‌కు స్నేహపూర్వక మద్దతు తెలుపుతూ..

Published : 01 Jul 2020 01:21 IST

రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాసిన ఫ్రాన్స్‌ రక్షణశాఖ మంత్రి

దిల్లీ: గల్వాన్‌ లోయ వద్ద భారత్‌ - చైనా సరిహద్దులో ఇరు దేశాల మధ్య భీకర ఘర్షణలో మన సైనికుల మరణంపై ఫ్రాన్స్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. భారత్‌కు స్నేహపూర్వక మద్దతు తెలుపుతూ ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. చైనాతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది జవానులకు సంతాపం వ్యక్తం చేశారు. ‘సైనికుల మరణం వారి కుటుంబాలు, దేశానికి ఇది తీరని లోటు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు ఫ్రెంచ్ సాయుధ దళాలతో పాటు నా స్నేహపూర్వక మద్దతును తెలియజేయాలనుకుంటున్నా’ అని పార్లీ లేఖలో పేర్కొన్నారు. ఫ్రాన్స్‌కు భారత్‌ వ్యూహాత్మక భాగస్వామి అని ఆమె గుర్తు చేసుకున్నారు. 

ఫ్రాన్స్ దశాబ్దాలుగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) యుద్ధ విమానాలను సరఫరా చేస్తోంది. ఫ్రాన్స్‌ ఇటీవలి కాలంలో భారత్‌తో తన రక్షణ చర్యలను వేగవంతం చేసింది. 2016లో రూ.59 వేల కోట్ల విలువైన ఒప్పందంలో భాగంగా భారత్‌ కోరిన 36 రఫేల్‌ యుద్ధ విమానాలను పంపించే ప్రక్రియను ముమ్మరం చేసింది. జులై 27న 6 విమానాలను అంబాలాలోని ఎయిర్ బేస్‌కు చేర్చేలా చర్యలు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని