'క‌రోనిల్'పై స్ప‌ష్ట‌త‌నిచ్చిన ప‌తంజ‌లి!

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌తోపాటు ఔష‌ధంపై విస్తృత ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ సంద‌ర్భంలో ఆయుర్వేద ఔష‌ధం(క‌రోనిల్‌)కు వైర‌స్‌ను తగ్గించే సామ‌ర్థ్యం ఉందంటూ ఈమ‌ధ్యే ప‌తంజ‌లి సంస్థ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Published : 01 Jul 2020 01:18 IST

దిల్లీ: ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌తోపాటు ఔష‌ధంపై విస్తృత ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ సంద‌ర్భంలో ఆయుర్వేద ఔష‌ధం(క‌రోనిల్‌)కు వైర‌స్‌ను తగ్గించే సామ‌ర్థ్యం ఉందంటూ ఈమ‌ధ్యే ప‌తంజ‌లి సంస్థ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ ప్ర‌క‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శలు రావ‌డంతో పాటు ప్ర‌భుత్వం కూడా వివ‌ర‌ణ కోరింది. దీంతో తాజాగా ఆ సంస్థ మ‌రోసారి స్ప‌ష్ట‌త‌నిచ్చే ప్ర‌య‌త్నం చేసింది. 'ప‌తంజ‌లి త‌యారుచేసిన క‌రోనిల్ ఔష‌ధం క‌రోనా వైర‌స్‌ను నియంత్రించ‌డం, న‌యం చేస్తుంద‌ని మేము చెప్ప‌లేదు' అని ఆ సంస్థ సీఈఓ ఆచార్య బాల‌కృష్ణ స్ప‌ష్టం చేశారు. మేము త‌యారు చేసిన మందుల‌ను కేవ‌లం ప్ర‌యోగ ద‌శ‌ల్లో భాగంగా క‌రోనా రోగుల్లో న‌యం చేసిన విష‌యాన్ని మాత్ర‌మే వెల్ల‌డించామ‌న్నారు. దీనిలో ఎటువంటి గంద‌ర‌గోళం లేద‌ని పేర్కొన్నారు.

అంతేకాకుండా, తాము ఎటువంటి 'క‌రోనా కిట్' త‌యారు చేయ‌లేద‌ని ఉత్త‌రాఖండ్ ఆయుర్వేద విభాగానికి ప‌తంజ‌లి సంస్థ వివ‌ర‌ణ ఇచ్చింది. అయితే, ప‌తంజ‌లి ప్ర‌క‌టించిన 'క‌రోనిల్'‌తోపాటు మ‌రో రెండు ఔష‌ధాల‌ను ప‌రీక్ష‌ల కోసం సేక‌రించిన‌ట్లు ఆ రాష్ట్ర ఆయుర్వేద విభాగానికి చెందిన‌ లైసెన్స్‌ అధికారి వైఎల్ రావత్ వెల్ల‌డించారు.

అంత‌కుముందు, ప్రపంచాన్ని పీడిస్తోన్న‌ కరోనాకు ఆయుర్వేద ఔష‌ధాన్ని తీసుకువచ్చినట్లు పతంజలి పేర్కొంది. ‘కరోనిల్‌’ పేరుతో తీసుకువచ్చిన ఈ ఔష‌ధాన్ని ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ గ‌త‌వారం హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆవిష్కరించడం గ‌మ‌నార్హం.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు