భారత్‌తో బంధం చాలా అవసరం: బిడెన్‌

అమెరికా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఓ సమావేశంలో మాట్లాడుతూ..భారత్‌తో భాగస్వామ్యం చాలా అవసరమని వ్యాఖ్యానించారు.

Published : 02 Jul 2020 18:00 IST

అమెరికా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి వ్యాఖ్య

వాషింగ్టన్‌: అమెరికా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భారత్‌తో భాగస్వామ్యం చాలా అవసరమని వ్యాఖ్యానించారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే, అమెరికా సహజ భాగస్వామి అయిన భారత్‌తో సంబంధాల బలోపేతానికి తన పాలనలో అధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పుకొచ్చారు.

యూఎస్ జాతీయ భద్రతకు భారతదేశం కీలకం కానుందా? అని ప్రశ్నించగా..‘ఆ భాగస్వామ్యం.. వ్యూహాత్మక భాగస్వామ్యం. ఆ ప్రాంతంలో మన భద్రత కోసం చాలా అవసరం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వారికి కూడా. ఎనిమిదేళ్ల ఒబామా, బిడెన్ పాలనలో భారత్‌తో మెరుగైన సంబంధాల కోసం తగిన చర్యలు తీసుకున్నాం. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే నా పరిపాలనలో ఆ దేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తాను’ అని బిడెన్ వెల్లడించారు. కాగా, నవంబరులో జరిగే ఎన్నికలు అమెరికా తన ఆత్మను నిలుపుకోడానికి చేసే పోరాటమని వ్యాఖ్యానించారు. అలాగే కరోనా వైరస్ గురించి ముందస్తుగా చేసిన హెచ్చరికలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ లెక్కచేయలేదని, దేశాన్ని రక్షించడంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు. ప్రస్తుతం దేశం సరైన నాయకుడికి కోసం ఎదురుచూస్తుందని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని