రష్యా నుంచి 33 యుద్ధ విమానాలొస్తున్నాయ్‌!

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సైన్యం తన అస్త్రాలను మెరుగుపరుచుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలుకు...

Updated : 02 Jul 2020 17:51 IST

కొనుగోలుకు రక్షణ శాఖ పచ్చజెండా

దిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సైన్యం తన అస్త్రాలను మెరుగుపరుచుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణశాఖ పచ్చజెండా ఊపింది.   యుద్ధ విమానాల్లో సుఖోయ్‌ ఎస్‌యూ -30 ఎంకేఐ ఫైటర్లు 12, మిగ్‌ -29 ఫైటర్లు 21 ఉన్నాయి. వీటితో పాటు మరో 59 మిగ్‌-29 యుద్ధ విమానాల ఆధునీకరణకు కూడా అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టు మొత్తంవిలువ రూ. 18148 కోట్లుగా స్పష్టంచేసింది. వీటితో పాటు గగనతలం  నుంచి గగనతలంలో లక్ష్యాలను కూల్చగలిగే 248 అస్త్ర బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ క్షిపణులు వాయుసేన, నౌకాదళం కోసం సమీకరిస్తోంది. అంతేకాకుండా  వెయ్యి కి.మీల దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణుల తయారీకి డీఆర్‌డీవోకి రక్షణశాఖ పచ్చజెండా ఊపింది. మొత్తంగా దేశీయ రక్షణ సంస్థలకు సంబంధించిన  రూ.38900 కోట్ల విలువైన ప్రతిపాదనల్లో దాదాపు రూ.31,130 కోట్లకు రక్షణశాఖ సమీకరణ మండలి ఆమోదం తెలిపింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని