అంతర్జాతీయ విమాన సేవలు జులై 31 తర్వాతే..!

దేశంలో కరోనా ఉద్ధృతి పెరిగిపోతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును....

Published : 03 Jul 2020 20:00 IST

డీజీడీఏ తాజా ప్రకటన

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి పెరిగిపోతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. విమాన సర్వీసుల రద్దును జులై 31 వరకు కొనసాగిస్తున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) వెల్లడించింది. పరిమిత మార్గాల్లో మాత్రమే ప్రయాణికుల విమానాలు కొన్ని నడపనున్నట్టు తెలిపింది.  కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేయగా.. ఆ తర్వాత దాన్ని జులై 15 వరకు పొడిగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  తాజాగా నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 

 అయితే, అమెరికా, కెనడా, ఐరోపా దేశాలతో పాటు గల్ఫ్‌ దేశాలకు ప్రయాణికుల విమాన సర్వీసులకు సంబంధించి ఆయా దేశాల విమానయాన శాఖలు సంప్రదింపులు జరుపుతున్నట్టు డీజీసీఏ ఛైర్మన్‌  అరవింద్‌ సింగ్‌ తెలిపారు. పౌర విమనాయానశాఖ కూడా అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌ నుంచి ద్వైపాకిక్షక సర్వీసులు నడపడంపై దృష్టి సారించినట్టు తెలిపింది. ప్రస్తుతం వందే భారత్‌ మిషన్‌లో భాగంగా మే 6 నుంచి ఎయిండియాతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రత్యేక విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసులతో పాటు కార్గో సర్వీసులు యథాతథంగా నడుస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని