దిల్లీలో మళ్లీ కంపించిన భూమి

దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం మరోసారి భూమి కంపించింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై..

Published : 03 Jul 2020 23:31 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం మరోసారి భూమి కంపించింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం పేర్కొంది. హరియాణాలోని గురుగ్రామ్‌కు నైరుతి దిశగా 60 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా తెలిపింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. గడిచిన రెండు నెలల్లో దిల్లీలో 7 సార్లు భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై 2.1 తీవ్రత నమోదవుతూ జూన్‌ 8న చివరిసారి రాజధానిలో భూమి కంపించింది. ఈ ప్రకంపనల పరంపర జాతీయ రాజధాని ప్రాంతంలో భారీ భూకంపం సంభవిస్తుందనే ఆందోళనలకు తావిస్తోంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని