లద్దాఖ్‌లో మోదీ సర్‌ప్రైజ్‌  (In Pics)

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భద్రతా దళాల్లో నైతిక స్థైర్యం పెంచడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ.....

Updated : 04 Jul 2020 00:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భద్రతా దళాల్లో నైతిక స్థైర్యం పెంచడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ రోజు ఉదయం 9.30గంటలకు లేహ్‌కు చేరుకున్న ప్రధాని.. గల్వాన్‌ లోయ వద్ద చైనాతో ఘర్షణలో వీర మరణం పొందిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నిమూలో 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రదేశంలో సీనియర్‌ సైనికాధికారులతో సమావేశమై సరిహద్దులో భద్రతా పరిస్థితులపై సమీక్షించారు. గల్వాన్‌ లోయలో గాయపడిన సైనికులను లద్దాఖ్‌లోని సైనిక ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రధాని వెంట చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణె ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. విస్తరణ వాదులు చరిత్రలో కలిసిపోయారంటూ చైనాకు చురకలంటించారు. గల్వాన్‌ లోయలో వీర సైనికుల పరాక్రమం యావత్‌ ప్రపంచానికి భారత్‌ శక్తిసామర్థ్యాలు చాటిందన్నారు. ప్రపంచంలో ఏ శక్తి ముందూ భారత్‌ మోకరిల్లదనీ.. మోకరిల్లబోదని మోదీ స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని