ముంబయిలో రెడ్‌ అలెర్ట్‌!

మహారాష్ట్రలోని ముంబయి, థానే, రత్నగిరి జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ముంబయిలో నిన్న ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలన్నీ నీట మునిగాయి........

Published : 05 Jul 2020 03:51 IST

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు: ఐఎండీ

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి, థానే, రత్నగిరి జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ముంబయిలో నిన్న ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ముంబయి పరిసర ప్రాంతాల్లో శనివారం కూడా  భారీ నుంచి అతి భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పాల్‌గ‌ఢ్‌, ముంబయి, రత్నగిరి, రాయ్‌గఢ్, థానేలలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 

ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. కనీసం రెండు రోజులు ట్రాఫిక్‌, విద్యుత్తు‌ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. శుక్రవారం కురిసిన వర్షాలకే ముంబయి మహానగరం అతలాకుతలం అయింది. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య 161.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. సముద్రంలో అలలు భారీ స్థాయిలో ఎగిసిపడుతున్న నేపథ్యంలో ప్రజవెవరూ తీరంవైపు వెళ్లొద్దని సూచించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని