అక్క‌డ‌ 100ఏళ్లలో తొలిసారి స‌రిహ‌ద్దులు మూత‌!

ప‌్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి తాజాగా ఆస్ట్రేలియాలోనూ విజృంభిస్తోంది. దీంతో అధిక జ‌నాభా క‌లిగిన రాష్ట్రాల స‌రిహ‌ద్దుల‌ను మూసివేస్తున్న‌ట్లు అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. న్యూసౌత్ వేల్స్‌తో ఇత‌ర ప్రాంతాల‌కు రాక‌పోక‌ల‌ను నిషేధిస్తున్న‌ట్లు విక్టోరియా ప్రీమియ‌ర్ డేనియ‌ల్ ఆండ్రూస్ ప్ర‌క‌టించారు.

Published : 07 Jul 2020 04:02 IST

ఆస్ట్రేలియాలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో రాక‌పోక‌లు బంద్‌
క‌రోనా తీవ్ర‌త పెర‌గ‌డంతో ప్ర‌భుత్వం నిర్ణ‌యం

సిడ్నీ: ప‌్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి తాజాగా ఆస్ట్రేలియాలోనూ విజృంభిస్తోంది. దీంతో అధిక జ‌నాభా క‌లిగిన రాష్ట్రాల స‌రిహ‌ద్దుల‌ను మూసివేస్తున్న‌ట్లు అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. న్యూసౌత్ వేల్స్‌తో ఇత‌ర ప్రాంతాలకు రాక‌పోక‌ల‌ను నిషేధిస్తున్న‌ట్లు విక్టోరియా ప్రీమియ‌ర్ డేనియ‌ల్ ఆండ్రూస్ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ఒకేరోజు 127 పాజిటివ్ కేసులు న‌మోదుకావడంతో పాటు ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోవ‌డంతో ఆండ్రూస్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, ఆస్ట్రేలియాలో రాష్ట్రాల సరిహ‌ద్దులు మూయడం మాత్రం వందేళ్ల‌లో ఇదే తొలిసారి. గ‌తంలో స్పానీష్ ఫ్లూ వ‌చ్చిన‌ప్పుడు మాత్రమే ఇలా ఇత‌ర‌ రాష్ట్రాలకు రాక‌పోక‌లు నిలిపివేసిన‌ట్లు అక్క‌డి అధికారులు పేర్కొన్నారు.

మెల్‌బోర్న్లో గ‌త కొన్ని రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. దీంతో 9ప్రాంతాల్లో పూర్తి లాక్‌డౌన్ విధించ‌డంతోపాటు 30ప్రాంతాల్లో భౌతిక‌దూరం నిబంధ‌న‌లను క‌ఠినంగా అమ‌లుచేస్తున్నారు. మెల్‌బోర్న్ నుంచి ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల‌కు రాక‌పోక‌ల‌ను నియంత్రిస్తున్నారు. విక్టోరియా, సౌత్‌వేల్స్ రాష్ట్రాల స‌రిహ‌ద్దుల మూసివేత‌కు ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి స్కాట్ మారిస‌న్ మ‌ద్ద‌తు ప‌లికారు. ఇదిలాఉంటే, ఆస్ట్రేలియాలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త త‌క్కువ‌గానే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 8900 క‌రోనావైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వీరిలో 106 మంది మృత్యువాత‌ప‌డ్డారు. అయితే, జూన్ నెల‌లో నిత్యం స‌గ‌టున 9పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌గా గ‌త‌ వారంనుంచి ఈ సంఖ్య 109కి చేరడంతో ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఇవీ చ‌దవండి..
భార‌త్‌...ప్ర‌పంచంలో మూడో స్థానంలోకి..!
చైనా వంచ‌న విధాన‌మే ప్ర‌పంచాన్ని ముంచింది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని