9-12 తరగతుల సిలబస్‌ తగ్గించిన సీబీఎస్‌ఈ

విద్యార్థుల పాఠ్య ప్రణాళికా భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను 9-12 తరగతుల పాఠ్యప్రణాళికను హేతుబద్ధీకరించామని సీబీఎస్‌ఈ తెలిపింది. దాదాపు 30శాతం వరకు సిలబస్‌...

Published : 07 Jul 2020 19:13 IST

ముంబయి: విద్యార్థుల పాఠ్య ప్రణాళికా భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను 9-12 తరగతుల పాఠ్యప్రణాళికను హేతుబద్ధీకరించామని సీబీఎస్‌ఈ తెలిపింది. దాదాపు 30శాతం వరకు సిలబస్‌ తగ్గించామని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖా మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు.

కొవిడ్‌-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్‌లాక్‌-2 నడుస్తున్నప్పటికీ కరోనా వైరస్‌ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. రోజుకు 20వేల కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో విద్యా సంస్థలు తెరిచేందుకు పరిస్థితులు అనువుగా లేవు. అసలు విద్యా సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందన్న అంశంపై స్పష్టత లేదు.

‘ప్రపంచం, దేశవ్యాప్తంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితుల దృష్ట్యా పాఠ్య ప్రణాళికను సవరించాలని సీబీఎస్‌ఈ సూచించింది. 9-12 తరుగతుల సిలబస్‌ను తగ్గించాలని కోరింది. నిర్ణయం తీసుకొనేందుకు కొన్ని రోజుల క్రితం విద్యారంగ నిపుణుల సలహాలను కోరాం. 1500 వరకు సూచనలు వచ్చినందుకు సంతోషంగా అనిపించింది. వారందరికీ ధన్యవాదాలు. విద్యార్జన ప్రక్రియకు ఉన్న ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకొని కీలక విషయాలను అలాగే ఉంచుతూ 30% వరకు పాఠ్యప్రణాళికను హేతుబద్ధీకరించాం’ అని పోఖ్రియాల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని