మరి వికాస్‌దూబేకు రక్షణ కల్పించిన వారి సంగతేంటి?

కరడుగట్టిన నేరస్థుడు వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో వేడి రాజేసుకుంది. అధికార పార్టీ లక్ష్యంగా విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. అతడు అరెస్టు కాగానే ప్రారంభమైన విమర్శల............

Updated : 21 Dec 2022 15:46 IST

ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు

లఖ్‌నవూ: కరడుగట్టిన నేరస్థుడు వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో వేడి రాజేసుకుంది. అధికార పార్టీ లక్ష్యంగా విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. అతడు అరెస్టు కాగానే ప్రారంభమైన విమర్శల పర్వం ఎన్‌కౌంటర్‌ తర్వాత మరింత పదునెక్కాయి. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తున్నాయి. భద్రతా లోపాల కారణంగానే దూబే మధ్యప్రదేశ్‌ పారిపోయాడని కాంగ్రెస్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ‘‘నేరగాడు హతమయ్యాడు. మరి అతనికి రక్షణ కల్పించిన అపరాధుల సంగతేంటి’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ సైతం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. వికాస్‌ దూబే కారు బోల్తా పడలేదని ఆరోపించారు. నిజాలు బయటకు వస్తే సర్కార్‌ కూలిపోతుందన్న భయంతోనే ఇలా చేయించారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వికాస్‌ దూబే కాల్‌ డేటా సహా విచారణలో వెల్లడైన అన్ని విషయాల్ని ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. ‘‘చనిపోయిన వ్యక్తులు ఎలాంటి కథలు చెప్పరు’’ అంటూ జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 

విపక్షాల వ్యాఖ్యల్ని భాజపా ఖండించింది. మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా మాట్లాడుతూ.. పోలీసులు వారి బాధ్యతని నిర్వర్తించారని వ్యాఖ్యానించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. ఈ విషయంలో విపక్షాల విమర్శలు సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు