అమెరికాలో కరోనా కరాళ నృత్యం

అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ అత్యంత ప్రమాదకరంగా ఉంది. దేశంలో మొత్తం కేసుల  సంఖ్య 33 లక్షలకు చేరువైంది. గత మూడు రోజుల నుంచి రోజుకు 60 వేల కొత్త కేసులు బయటపడగా.. నిన్న ఒక్క రోజే 72 వేల కేసులు నమోదయ్యయి. గడిచిన 24 గంటల్లో

Published : 11 Jul 2020 12:14 IST

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ అత్యంత ప్రమాదకరంగా ఉంది. దేశంలో మొత్తం కేసుల  సంఖ్య 33 లక్షలకు చేరువైంది. గత మూడు రోజుల నుంచి రోజుకు 60 వేల కొత్త కేసులు బయటపడగా.. నిన్న ఒక్క రోజే 72 వేల కేసులు నమోదయ్యయి. గడిచిన 24 గంటల్లో  849 మంది  మృతి చెందారు. అమెరికాలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 32,91,786కి చేరగా మృతుల సంఖ్య 1,36,671కి పెరిగింది. ఫ్లోరిడార్‌, టెక్సాస్‌, కాలిఫోర్నియాలో వైరస్‌ వ్యాప్తి మరీ ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనే 30 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోజుకు లక్షకు పైగా కేసులు నమోదయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని నిపుణులు అభిప్రాపడుతున్నారు. ఇప్పటి వరకు 14,60,465 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని