‘స్థిరత్వం పేరిట ఉద్రిక్తతలు సృష్టించొద్దు’

పొరుగు దేశాలపై చైనా దౌర్జన్యానికి, బెదిరింపులకు పాల్పడుతోందన్న అమెరికా ప్రకటనను డ్రాగన్ తప్పుబట్టింది. అలాగే దక్షిణ చైనా సముద్రంలో చైనా అధికారాల్ని అమెరికా వ్యతిరేకించడం తగదని వ్యాఖ్యానించింది......

Updated : 14 Jul 2020 10:26 IST

దక్షిణ చైనా సముద్రంపై అమెరికా, చైనా మాటల యుద్ధం

వాషింగ్టన్‌: పొరుగు దేశాలపై చైనా దౌర్జన్యానికి, బెదిరింపులకు పాల్పడుతోందన్న అమెరికా ప్రకటనను డ్రాగన్ తప్పుబట్టింది. అలాగే దక్షిణ చైనా సముద్రంలో చైనా అధికారాల్ని అమెరికా వ్యతిరేకించడం తగదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఈ వివాదాలతో అమెరికాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. పదే పదే తలదూర్చుతోందని చెప్పుకొచ్చింది. ఇతర దేశాల సార్వభౌమత్వానికి సంబంధించిన విషయాల్లో తలదూర్చొద్దన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని హితవు పలికింది.  దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతి స్థాపనకు ఎలాంటి అడ్డంకులు సృష్టించొద్దని పేర్కొంది. స్థిరత్వం పేరిట ఈ ప్రాంతంలో ఉద్రిక్తలు సృష్టించేందుకు.. తన బలాన్ని ప్రదర్శించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించింది. 

ఎక్కువ భాగం దక్షిణ చైనా సముద్ర వనరులపై హక్కులు తమవేనని చైనా  వాదించడం చట్టవిరుద్ధమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సోమవారం ప్రకటించారు. ఆ ప్రాంతంలో ఇతర భాగస్వాములపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడం తగదని స్పష్టం చేశారు. దక్షిణ చైనా సముద్రాన్ని చైనా తమ ‘జల సామ్రాజ్యం’గా పేర్కొనడం ప్రపంచ దేశాలు అంగీకరించబోవని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా చైనా స్పందిస్తూ.. పాంపియో వ్యాఖ్యల్ని తప్పుబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని