రామ మందిరానికి రూ.2,100 కోట్ల విరాళాలు

అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇప్పటివరకూ రూ.2,100 కోట్లు విరాళాలు వచ్చినట్లు ఆలయ ట్రస్ట్‌ వెల్లడించింది.

Published : 01 Mar 2021 19:37 IST

అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇప్పటివరకూ రూ.2,100 కోట్లు విరాళాలు వచ్చినట్లు ఆలయ ట్రస్ట్‌ వెల్లడించింది. అయితే కొన్ని చెక్కులు ఇంకా డిపాజిట్‌ కాలేదని.. విరాళాల లెక్క పెరగవచ్చని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌ తెలిపారు. 42 రోజుల విరాళాల కార్యక్రమం.. శనివారంతో పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. విరాళాల కార్యక్రమాన్ని కొనసాగించాలని విదేశాల్లోని భారతీయులు కోరుతున్నారని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని