కొత్తరకం కరోనా.. ప్రస్తుత వ్యాక్సిన్లు పనిచేస్తాయా?
అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర అంశాలు...
వాషింగ్టన్: చైనాలోని వుహాన్ కేంద్రంగా విశ్వ మహమ్మారికి కారణమైన కరోనా వైరస్... ఏడాది కాలంలో ఎన్నో మార్పులకు గురైంది. ముఖ్యంగా దాని కొమ్ములోని మాంసకృత్తు (స్పైక్ ప్రొటీన్) అనేక ఉత్పరివర్తనాలు చెంది, ప్రవర్తన కూడా మార్చుకుంది. అలా... వుహాన్ వైరస్‌కు భిన్నంగా ఇప్పుడు దక్షిణాఫ్రికా, బ్రిటన్, బ్రెజిల్ నుంచి కొత్తరకం కరోనా వైరస్లు పుట్టుకొచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని రకాలు రావచ్చు కూడా. మరి... వుహాన్ వైరస్‌ను లక్ష్యంగా చేసుకుని, శరీరంలో దాని యాంటీబాడీలను సృష్టించేలా పలు దేశాల్లో తయారైన వ్యాక్సిన్లు, ఔషధాలు కొత్తరకం కరోనా వైరస్‌లను నియంత్రిస్తాయా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. సరిగ్గా ఈ అంశంపైనే అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఇటీవల పరిశోధన సాగించింది. ఇందులో వెల్లడైన పలు ఆసక్తికర విషయాలను నేచర్ మెడిసిన్ పత్రిక అందించింది.
సమర్థంగా నియంత్రించలేవా!
కొవిడ్-19 యాంటీబాడీల ఆధారంగా ఇప్పటివరకూ తయారైన వ్యాక్సిన్లు ఇతరత్రా ఔషధాలు... భవిష్యత్తు రకాల కరోనా వైరస్‌లను సమర్థంగా నియంత్రించలేకపోవచ్చని పరిశోధనకర్త మైఖేల్ ఎస్ డైమండ్ సందేహం వ్యక్తం చేశారు. ఎందుకంటే... ఫైజర్ సంస్థ ఉత్పత్తి చేసిన కొవిడ్ టీకాను బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో కనిపిస్తున్న కొత్తరకం వైరస్‌లపై శాస్త్రవేత్తలు ప్రయోగించి చూశారు. ‘‘కరోనా టీకా వేయించుకున్న కొందరిలో యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి. వృద్ధులు, రోగ నిరోధకశక్తి బలహీనంగా ఉన్నవారిలో అవి తగినంతగా పుట్టకపోవచ్చు. ఇలాంటి వారికి కొత్తరకం కరోనా వైరస్ల నుంచి పూర్తిస్థాయి రక్షణ ఉంటుందన్నది అనుమానమే. అంతెందుకు... వుహాన్ వైరస్ బాధితుల్లో సహజంగా అభివృద్ధి చెందిన ప్రతినిరోధకాలు సైతం కొత్త వైరస్‌లను సమర్థంగా ఎదుర్కోలేకపోవచ్చు! ఫైజర్ వ్యాక్సిన్ వల్ల శరీరంలో ఉత్పత్తయిన యాంటీబాడీలు బ్రిటన్ రకం వైరస్‌ను సమర్థంగానే కట్టడి చేశాయి. కానీ... దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకాల వైరస్‌లను సమర్థంగా ఎదుర్కోవాలంటే సహజ స్థాయికి 3.5 నుంచి 10 రెట్లు ఎక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తి కావాలి. ప్రస్తుత వ్యాక్సిన్లు అందరిలోనూ ఆ స్థాయిలో ప్రతినిరోధకాలను ఉత్పత్తి చేయగలవా? కొత్త వైరస్ల నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించగలవా? అన్నది ఇప్పుడే చెప్పలేం. ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే కొత్త కరోనా వైరస్‌లను, వాటి యాంటీబాడీలను గమనిస్తూ... వ్యాక్సిన్లలో మార్పులు చేయడం, కొత్త టీకాలను అభివృద్ధి చేయడం ముఖ్యం’’ అని మైఖేల్ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Modi:మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!
-
Crime News
Telangana News: కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
-
Sports News
Team india: ఆ ఇద్దరిలో ఎవరిని తుదిజట్టులో ఆడిస్తారో.. : మాజీ క్రికెటర్
-
Politics News
Revanth Reddy: మునుగోడు పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరం!
-
Movies News
Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
-
India News
సోనియాకు మళ్లీ పాజిటివ్.. ఐసోలేషన్‌లో కాంగ్రెస్ అధినేత్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Crime News: సినిమా చూసి.. మూఢవిశ్వాసంతో బలవన్మరణం