డీఎన్‌ఏ పరీక్షతో తేలిన శునక పంచాయితీ!

డీఎన్‌ఏ పరీక్షతో కుక్క యజమానిని తేల్చారు మధ్యప్రదేశ్‌ పోలీసులు. నిరుడు ఆగస్టులో ఓ లాబ్రాడర్‌ జాతి కుక్క..

Updated : 20 Mar 2021 17:17 IST

అసలు యజమానికి అప్పగించిన పోలీసులు

హోషంగాబాద్‌: డీఎన్‌ఏ పరీక్షతో కుక్క యజమానిని తేల్చారు మధ్యప్రదేశ్‌ పోలీసులు. నిరుడు ఆగస్టులో ఓ లాబ్రాడర్‌ జాతి కుక్క.. నాదంటే నాదంటూ షాదాబ్‌ ఖాన్, కార్తీక్‌ శివహరేలు హోషంగాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఎంతగా విచారణ చేసినా, అసలు యజమానెవరో పోలీసులు తేల్చలేకపోయారు. చివరకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. కుక్కను తాను పచ్‌మడీ ప్రాంతం నుంచి కొనుగోలు చేశానని షాదాబ్‌ తెలిపారు. దీంతో కుక్క నుంచి, కుక్క తల్లి నుంచి శాంపిళ్లను సేకరించి డిసెంబర్‌లో డీఎన్‌ఏ పరీక్షల కోసం హైదరాబాద్‌ పంపారు. ఆ ఫలితాలు ఇప్పుడు వచ్చాయి. కుక్క యజమాని షాదాబేనని తేలింది. ‘‘డీఎన్‌ఏ పరీక్షల కోసం రూ.50 వేలు ఖర్చు పెట్టాను. చివరకు నా కుక్క నాకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది’’ అని షాదాబ్‌ ఖాన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని