- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
కరోనా ఉద్ధృతిపై ఊపిరితిత్తుల ఉష్ణోగ్రత ప్రభావం
కొత్త మందుల రూపకల్పనకు మార్గం సుగమం
లండన్: ఎగువ, దిగువ శ్వాసకోశ వ్యవస్థల్లోని సహజసిద్ధ ఉష్ణోగ్రత వైరుధ్యాలు కరోనా ఉద్ధృతిపై ప్రభావం చూపుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వైరస్ పునరుత్పత్తి, అనంతరం మానవ రోగ నిరోధక వ్యవస్థను క్రియాశీలం చేయడంపైన వీటి ప్రభావం ఉంటోందని తెలిపారు. కొవిడ్-19కు కొత్త చికిత్స విధానాలు, నివారణ ప్రక్రియలను రూపొందించడానికి ఈ పరిశోధన ఫలితాలు దోహదపడతాయని పేర్కొంది. స్విట్జర్లాండ్‌లోని బెర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు.. తాజా కొవిడ్-19 కారక సార్స్-కోవ్-2, 2002-03లో వచ్చిన సార్స్-కోవ్ వైరస్ల ఇన్ఫెక్షన్ తీరుతెన్నులను పోల్చి చూశారు. ఈ రెండు రకాల వైరస్ల మధ్య జన్యుపరంగా చాలా సారూప్యతలు ఉన్నప్పటికీ వాటి తీరులో కొన్ని ముఖ్యమైన వైరుధ్యాలూ ఉన్నాయని వారు చెప్పారు.
* 2002-03లో వచ్చిన వైరస్.. తీవ్రస్థాయి వ్యాధిని కలిగించింది. దిగువ శ్వాసకోశ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్కు ఇది కారణమైంది.
* ప్రస్తుత కొవిడ్ కారక సార్స్-కోవ్-2 మాత్రం చాలా వరకూ నాసిక కుహరం, శ్వాసనాళం సహా ఎగువ శ్వాస మార్గంలో ఇన్ఫెక్షన్ను కలిగిస్తోంది.
* సార్స్ వైరస్‌తో ఇన్ఫెక్షన్ సోకినవారిలో లక్షణాలు బయటపడిన తర్వాతే వారి ద్వారా వ్యాధి వ్యాప్తి జరిగింది. ఫలితంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అడ్డుకోవడం సులువైంది.
* సార్స్-కోవ్-2 మాత్రం.. లక్షణాలు కనిపించడానికి ముందే సదరు వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపిస్తోంది.
ఉష్ణోగ్రత వైరుధ్యాలే కారణం..
ఎగువ శ్వాస మార్గాల్లో 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని, అక్కడ కొవిడ్ వైరస్ పునరుత్పత్తి చెందడానికి ఈ ఉష్ణోగ్రత దోహదపడుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. దిగువ ఊపిరితిత్తుల్లోని 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇక్కడే వైరస్ ఎక్కువగా తన సంఖ్యను పెంచుకుందని తెలిపారు. కొవిడ్ వైరస్‌కు భిన్నంగా.. సార్స్-కోవ్ మాత్రం ఉష్ణోగ్రతల్లోని వైరుధ్యాల ప్రభావానికి లోను కాలేదని తేల్చారు.
దిగువ శ్వాసకోశ వ్యవస్థతో పోల్చినప్పుడు.. ఎగువ శ్వాసనాళాల్లో సార్స్-కోవ్-2 వైరస్ ఇన్ఫెక్షన్ను అడ్డుకోవడానికి అక్కడి కణాల్లోని సహజసిద్ధ రోగనిరోధక వ్యవస్థ అంత బలంగా స్పందించలేదని వెల్లడైంది. ఈ ప్రతిస్పందన వ్యవస్థ బలాన్ని బట్టి.. వైరస్ పునరుత్పత్తి ఆధారపడి ఉంటుంది. ‘‘ఈ నేపథ్యంలో సార్స్-కోవ్-2 పునరుత్పత్తి, మానవ రోగనిరోధక యంత్రాంగంపై ఉష్ణోగ్రత ఆధారంగా జరిగే మార్పులను పరిశీలిస్తే.. ఎగువ శ్వాసకోశ వ్యవస్థలోనే ఆ వైరస్ ఎక్కువగా పునరుత్పత్తి చెందుతున్నట్లు వెల్లడవుతోంది. ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉండటానికి కూడా ఇదే కారణం’’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
DK: ఆ సమయంలో రోహిత్‌పై విమర్శకుల బంతులు దూసుకొచ్చాయి: డీకే
-
Crime News
రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
-
Movies News
Anasuya: దయచేసి.. నా ట్వీట్లను రాజకీయం చేయొద్దు: అనసూయ
-
General News
Andhra News: బకాయిలు చెల్లించేశాం.. ఆ నిషేధం ఏపీకి వర్తించదు: విజయానంద్
-
Sports News
IND vs PAK : దాయాదుల పోరులో భారత్‌కే ఎడ్జ్.. ఎందుకో చెప్పిన పాక్ మాజీ ఆటగాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?