
పెళ్లి రోజే ఎన్నికల్లో విజయం
వివాహం జరిగే రోజే మరో శుభవార్త అందుకుంది ఓ వధువు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించింది. పెళ్లి దుస్తుల్లోనే లెక్కింపు కేంద్రానికి వెళ్లి ధ్రువపత్రాన్ని అందుకుంది. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్ రాంపుర్ జిల్లాలో జరిగింది. ఈనెల 2న మొహమ్మద్పుర్ జాదిద్ గ్రామానికి చెందిన పూనమ్ వివాహం. ఆ సంబరాల్లో ఉండగానే వారికి మరో శుభవార్త అందింది. ఆరోజే వెల్లడైన స్థానిక పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో బీడీసీ సభ్యురాలిగా పూనమ్ గెలిచినట్లు తెలిసింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మండపం నుంచి నేరుగా లెక్కింపు కేంద్రానికి వెళ్లిన పూనమ్.. వివాహ వస్త్రధారణలోనే అధికారుల నుంచి ధ్రువపత్రాన్ని అందుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.