Oxygen ఇంట్లో ఉన్నవారికి కూడా..

దిల్లీలో ఆక్సిజన్‌కు విపరీతంగా డిమాండ్‌ ఏర్పడిన నేపథ్యంలో ఇంట్లో (హోం ఐసొలేషన్‌) ఉన్న కరోనా బాధితులకు

Published : 07 May 2021 16:17 IST

దిల్లీ ప్రభుత్వం నిర్ణయం

దిల్లీలో ఆక్సిజన్‌కు విపరీతంగా డిమాండ్‌ ఏర్పడిన నేపథ్యంలో ఇంట్లో (హోం ఐసొలేషన్‌) ఉన్న కరోనా బాధితులకు ఆన్‌లైన్‌ ద్వారా ఆక్సిజన్‌ను పంపిణీ చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంబులెన్స్‌లు, నర్సింగ్‌ హోమ్‌లు, ఇతర కొవిడ్‌ ఆసుపత్రులకు కూడా పంపిణీ చేస్తామని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం ప్రజలు దిల్లీ అధికారిక వెబ్‌సైట్లో ఫొటో ఐడీ, ఆధార్, కొవిడ్‌ పాజిటివ్‌ నివేదిక సహా సంబంధిత వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా బాధ్యత జిల్లా మేజిస్ట్రేట్లు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వం ఆదేశించింది. డీలర్ల వద్ద ఉన్న నిల్వల ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్‌.. తేదీ, సమయం, పంపిణీ కేంద్రం చిరునామా మొదలైన వివరాలతో దరఖాస్తుదారులకు ఈ-పాస్‌లను మంజూరు చేస్తారని వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని