Corona: ఇప్పటివరకూ సోకింది 2% మందికే

ప్రస్తుత పోకడను బట్టి... దేశంలో మహమ్మారి క్రమంగా క్షీణిస్తున్నట్టు అర్థమవుతోందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఈ నెల 17 నాటికి దేశ జనాభాలో 1.8% మందికే వైరస్‌ సోకిందని, ఇంకా 98% మందికి ఈ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. నీతి ఆయోగ్‌ (ఆరోగ్య విభాగం) సభ్యుడు వీకే పాల్‌ మంగళవారం

Updated : 19 May 2021 08:48 IST

దేశంలో 98% జనాభాకు ఇంకా మహమ్మారి ముప్పుంది
కేంద్రం హెచ్చరిక
వైరస్‌ క్షీణించవచ్చని అంచనా

దిల్లీ: ప్రస్తుత పోకడను బట్టి... దేశంలో మహమ్మారి క్రమంగా క్షీణిస్తున్నట్టు అర్థమవుతోందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఈ నెల 17 నాటికి దేశ జనాభాలో 1.8% మందికే వైరస్‌ సోకిందని, ఇంకా 98% మందికి ఈ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. నీతి ఆయోగ్‌ (ఆరోగ్య విభాగం) సభ్యుడు వీకే పాల్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. చాలా రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి రేఖ నిలకడగా ఉందన్నారు. మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. వైరస్‌ పునరుత్పత్తి సంఖ్య ఒకటి కంటే తక్కువగానే ఉన్నందున... మహమ్మారి క్షీణిస్తున్నట్టుగా శాస్త్రీయ కోణంలో భావించవచ్చన్నారు.

బ్లాక్‌ ఫంగస్‌పై ఉదాసీనత వద్దు
దేశంలో ఇప్పటివరకూ 1.8% జనాభా కొవిడ్‌కు గురైనట్టు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. అంటే సుమారు 98% మందికి ఇంకా వైరస్‌ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల సంఖ్య ప్రస్తుతం తక్కువగానే ఉందని, అలాగని ఉదాసీనంగా ఉండటానికి వీల్లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని