Corona: గంగానది ఒడ్డున భారీగా మృతదేహాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో గంగానది ఒడ్డున రోజుకోచోట ఇసుకలో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు బయటపడుతుండడం కలకలం సృష్టిస్తోంది.

Published : 24 May 2021 12:14 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో గంగానది ఒడ్డున రోజుకోచోట ఇసుకలో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు బయటపడుతుండడం కలకలం సృష్టిస్తోంది. ఇవన్నీ కొవిడ్‌ మృతులవేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ప్రయాగ్‌రాజ్‌ జిల్లా దేవరఖ్‌ ఘాట్‌ వద్ద ఇసుకలో వందల మృతదేహాలు బయటపడుతున్నాయి. శ్మశాన వాటికల్లో ఖాళీ లేకపోవటం, అంత్యక్రియలకు ఖర్చు పెరగటం వల్ల నది ఒడ్డునే ఇసుకలో పూడ్చి పెడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మృతదేహాలను పూడ్చిపెట్టడాన్ని నిషేధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని