Green Tea: మహమ్మారిపై పచ్చ‘టి’ అస్త్రం

కొవిడ్‌-19ను ఎదుర్కోవడంలో గ్రీన్‌ టీ సాయపడుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అందులోని ఒక పదార్థానికి

Updated : 06 Jun 2021 10:54 IST

 గ్రీన్‌ టీలోని పదార్థానికి వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం

బ్రిటన్‌: కొవిడ్‌-19ను ఎదుర్కోవడంలో గ్రీన్‌ టీ సాయపడుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అందులోని ఒక పదార్థానికి ఈ సామర్థ్యం ఉందని చెప్పారు. స్వాన్‌సీ విశ్వవిద్యాలయానికి చెందిన సురేశ్‌ మోహన్‌కుమార్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన సాగించారు. కొంతకాలం కిందట వరకూ ఆయన భారత్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఊటీలోని జేఎస్‌ఎస్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు సాగించారు. ‘‘ప్రకృతి అత్యంత పురాతన ఔషధశాల. సరికొత్త మందులకు అది నెలవు. వీటిలోని పదార్థాలు కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో సాయపడగలవా అన్నది మేం పరిశీలించాం. ఇతర కరోనా వైరస్‌లపై పనిచేసే సామర్థ్యమున్న అనేక సహజసిద్ధ పదార్థాలను శోధించాం. ఇందుకోసం కృత్రిమ మేధస్సుతో కూడిన కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ను ఉపయోగించాం. గ్రీన్‌ టీలోని ఒక పదార్థానికి కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని మా పరిశోధన సూచిస్తోంది’’ అని సురేశ్‌ వివరించారు. దాన్ని ‘గాలోక్యాటెచిన్‌’గా గుర్తించినట్లు తెలిపారు. అది సులువుగా లభ్యమవుతుందని పేర్కొన్నారు. అయితే ఈ పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, విస్తృత అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపారు. కొవిడ్‌ చికిత్సలో ఈ పదార్థ సురక్షిత, సమర్థతను తేల్చాల్సి ఉందన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని