Luck: రాత్రికి రాత్రే కోటీశ్వరులైన జాలర్లు 

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వచ్చి తలుపుతడుతుందో ఎవ్వరికీ తెలియదు. పశ్చిమ యెమెన్‌కు చెందిన 35 మంది జాలర్లు రోజూలానే సముద్రంలో

Published : 06 Jun 2021 14:35 IST

యెమెన్‌: అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వచ్చి తలుపుతడుతుందో ఎవ్వరికీ తెలియదు. పశ్చిమ యెమెన్‌కు చెందిన 35 మంది జాలర్లు రోజూలానే సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. చనిపోయిన ఓ స్పెర్మ్‌ తిమింగలం వారి పడవకు ఎదురుపడింది. ఆ భారీ కాయాన్ని కోసి చూసిన వారికి దాని కడుపులో విలువైన పదార్థం ‘అంబగ్రీస్‌’ లభించింది. దానిని మార్కెట్‌కు తీసుకెళ్లగా రూ.10 కోట్లు పలుకుతుందని వ్యాపారులు చేప్పారు. దీంతో జాలర్లంతా పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. అంబగ్రీస్‌ పదార్థం సాధారణంగా తిమింగలం వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. సెంట్ల తయారీలో దీనికి విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని