
Updated : 18 Jun 2021 12:28 IST
Weight Loss: శునకానికి బేరియాట్రిక్ శస్త్రచికిత్స
5 కిలోల బరువు తగ్గుదల
పుణె: అధిక బరువుతో ఇబ్బంది పడుతూ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారి గురించి వినే ఉంటారు. అయితే తాజాగా ఓ శునకానికి ఆ తరహా ఆపరేషన్ చేయడం విశేషం. పుణెకు చెందిన యాస్మిన్ దారువాలా ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. ఆమె దానికి దీపిక అనే పేరు పెట్టుకున్నారు. దీపిక బరువు పెరిగి 50 కిలోలకు చేరుకోవడంతో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుండేది. జంతు వైద్య నిపుణుడు ఆ శునకాన్ని పరిశీలించి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దానివల్ల శునకం బరువు తగ్గి సమస్య తొలగుతుందని చెప్పారు. ఆపరేషన్ తర్వాత దీపిక 5 కిలోల బరువు తగ్గింది. శునకానికి బరువును తగ్గించే సర్జరీ చేయడం దేశంలో ఇదే తొలిసారని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి
Tags :