Mango: 12 మామిడిపండ్లు రూ.1.2 లక్షలు 

రోడ్డు పక్కన మామిడిపండ్లు అమ్ముతున్న బాలిక దగ్గరకు ఓ వాహనం వచ్చి ఆగింది.

Updated : 28 Jun 2021 09:56 IST

బాలిక కల సాకారం చేసిన వ్యాపారవేత్త

రోడ్డు పక్కన మామిడిపండ్లు అమ్ముతున్న బాలిక దగ్గరకు ఓ వాహనం వచ్చి ఆగింది. అందులోంచి దిగిన వ్యక్తి ఒక్కో మామిడిపండు రూ.10 వేలకు కొంటున్నట్లు తనే ప్రకటించాడు. ఆ బాలిక ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే మొత్తం పన్నెండు పండ్లకు రూ.1.2 లక్షల మేర ఆ బాలిక తండ్రి శ్రీమర్‌ కుమార్‌ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశాడు. ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని జంషెడ్‌పుర్‌కు చెందిన ఆ బాలిక పేరు తులసి కుమారి. ఆమెకు సాయం చేసిన వ్యాపారవేత్త హమేయా హెటె. ఓ కంపెనీ ఎండీగా పనిచేస్తున్నారు. తులసి కుమారి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతోంది. కరోనా లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతపడి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ కొనే ఆర్థికస్తోమత లేక.. రోడ్డు పక్కన మామిడిపండ్లు అమ్మి డబ్బు పోగు చేయాలని తులసి భావించింది. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న హమేయా హెటె.. బాలికను వెతుక్కొంటూ వచ్చి అలా సాయం చేశారన్న మాట. ఇపుడు తులసి స్మార్ట్‌ఫోన్‌ కొని ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతోంది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని