Britain: లేబర్‌ పార్టీ అభ్యర్థి సెల్ఫ్‌గోల్‌!

బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ అభ్యర్థి పరిస్థితి తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లు అయ్యింది! చివరికి సొంత పార్టీ వారి నుంచే తీవ్ర విమర్శలకు గురికావాల్సి వచ్చింది. వెస్ట్‌యార్క్‌షైర్‌లోని బ్యాట్లే అండ్‌ స్పెన్‌ ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం..

Updated : 30 Jun 2021 11:41 IST

 మోదీ ఫొటోతో ప్రత్యర్థి పార్టీని ఇరుకునపెట్టే యత్నంలో విమర్శల పాలు

లండన్‌: బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ అభ్యర్థి పరిస్థితి తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లు అయ్యింది! చివరికి సొంత పార్టీ వారి నుంచే తీవ్ర విమర్శలకు గురికావాల్సి వచ్చింది. వెస్ట్‌యార్క్‌షైర్‌లోని బ్యాట్లే అండ్‌ స్పెన్‌ ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం లేబర్‌ పార్టీ అభ్యర్థి కెయిర్‌ స్టార్మర్‌ ఒక కరపత్రాన్ని ప్రచురించారు. అందులో భారత ప్రధాని మోదీతో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కరచాలనం చేస్తున్న ఫొటోను ముద్రించి, దాని కింద ‘మీకు మద్దతివ్వని టోరీ పార్టీ ఎంపీని ప్రమాదంలోకి నెట్టివేయవద్దు’ అనే వ్యాఖ్యను జోడించారు.

2019లో జీ7 సదస్సు  సందర్భంగా నేతలు దిగిన చిత్రాన్ని లేబర్‌ పార్టీ అభ్యర్థి ఇందుకు ఉపయోగించారు. ఆ చిత్రం, దాని కింద రాసిన వ్యాఖ్యపై కన్జర్వేటివ్‌(టోరీ) పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ(లేబర్‌) నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. భారత్‌ వ్యతిరేక, విభజించి పాలించే ధోరణికి ఆ కరపత్రం నిదర్శనమని పలువురు దుయ్యబట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వ అధినేత, బ్రిటన్‌కు సన్నిహితమైన దేశ నేత ఫొటోను ఇక్కడి ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం వినియోగించుకోవడం విచారకరమని బ్రిటన్‌లోని భారత సంతతికి ప్రాతినిధ్యం వహించే ‘లేబర్‌ ఫ్రండ్స్‌ ఆఫ్‌ ఇండియా’ సంస్థ ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. ఆ కరపత్రాన్ని చౌకబారు ప్రచార గిమ్మిక్కుగా లేబర్‌ పార్టీ ఎంపీ, భారత సంతతికి చెందిన వీరేంద్ర శర్మ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు