Second Wave: రెండో వేవ్‌ అయిపోలేదు: కేంద్రం

కరోనా రెండో ఉద్ధృతి ముగిసిపోలేదని.. ప్రజలు అలసత్వంగా ఉండొద్దని కేంద్ర ప్రభుత్వం

Updated : 03 Jul 2021 12:07 IST

ఈనాడు, దిల్లీ: కరోనా రెండో ఉద్ధృతి ముగిసిపోలేదని.. ప్రజలు అలసత్వంగా ఉండొద్దని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. రోజువారీ కేసులు తగ్గుతున్నప్పటికీ.. జూన్‌ 23తో ప్రారంభమైన వారంలో 71 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10%పైగా నమోదైనట్టు గుర్తుచేసింది.

దేశంలో ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో సమస్యాత్మక జిల్లాలున్నట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. వైరస్‌ తగ్గిపోయిందన్న ఉద్దేశంతో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని.. యూరప్‌లో మళ్లీ కేసులు పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించారు. దేశంలో వ్యాక్సినేషన్‌ పురోగతిని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వివరించారు. జూన్‌ 21 నుంచి రోజుకు సగటున 50 లక్షల మందికి టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. జనవరి 16న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కాగా ఇంతవరకు 34.41 కోట్లకు పైగా టీకా డోసులు వేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని