Russia: అలా కోటీశ్వరుడై.. ఇలా జైలుకెళ్లాడు

సాంకేతిక లోపాల కారణంగా వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తం కనిపించడం గురించి వినే ఉంటాం.

Updated : 04 Jul 2021 10:44 IST

రష్యా: సాంకేతిక లోపాల కారణంగా వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తం కనిపించడం గురించి వినే ఉంటాం. అలా వచ్చిపడిన డబ్బును ముందూ వెనుకా చూడకుండా ఖర్చు చేసేస్తే చిక్కులు తప్పవని చెప్పే ఉదాహరణ ఇది. రష్యాలోని టులాలో ఓ కార్ల సంస్థలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేసే 35 ఏళ్ల రోమాన్‌ యుర్కోవ్‌.. గతేడాది జూన్‌లో ఓ బెట్టింగ్‌ కేంద్రంలో కొంత డబ్బు గెలుచుకున్నాడు. అనంతరం ఆయన ఖాతాలో ఏకంగా 9.5 కోట్ల రూబుల్స్‌ (రూ.9.67 కోట్లు) ఉన్నట్టు స్థానిక వీటీబీ బ్యాంకు నుంచి మెసేజ్‌ వచ్చింది. అంతే.. ముందూవెనుకా చూడకుండా, ఆ సొమ్ములను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశాడు. 4 అపార్ట్‌మెంట్లు, ఐఫోన్, బీఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్‌ కార్లు కొనేశాడు. నవంబర్‌లో అసలు కథ బయటపడింది. బ్యాంకు అధికారులు త్రైమాసిక రిపోర్టు రూపొందించే సమయంలో.. సాంకేతిక లోపంతో రోమాన్‌ యుర్కోవ్‌ ఖాతాలోకి భారీగా డబ్బు చేరిందని గుర్తించారు. వెంటనే అతని ఖాతా సీజ్‌ చేశారు. అప్పటికి అందులో 39 రూబుల్స్‌ మాత్రమే ఉన్నాయి. బ్యాంకు సొమ్మును తిరిగివ్వకుండా ఖర్చు పెట్టాడనే కారణంతో దోపిడీ కేసు పెట్టడంతో రోమాన్‌ను అరెస్టు చేశారు. ఈ ‘యాక్సిడెంటల్‌ మిలియనీర్‌’ను స్థానిక కోర్టు దోషిగా తేల్చి జైలుకు పంపింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు