Rajasthan: ఒంటెలపై ఉపాధ్యాయులు

కరోనా రెండో దశ విజృంభణతో మూసేసిన పాఠశాలలు ఇంకా తెరచుకోలేదు. దీంతో ఆన్‌లైన్‌ తరగతులు మొదలయ్యాయి.

Published : 11 Jul 2021 09:15 IST

బాడ్మేర్‌: కరోనా రెండో దశ విజృంభణతో మూసేసిన పాఠశాలలు ఇంకా తెరచుకోలేదు. దీంతో ఆన్‌లైన్‌ తరగతులు మొదలయ్యాయి. కానీ.. నెట్‌వర్క్‌ సదుపాయం లేక రాజస్థాన్‌లోని బాడ్మేర్‌లో అనేక మంది చిన్నారులు తరగతులకు దూరంగా ఉంటున్నారు. విద్యార్థుల అసౌకర్యాన్ని గమనించిన ఉపాధ్యాయులు.. వారి వద్దకే వెళ్లి విద్యను బోధిస్తున్నారు. ఈ క్రమంలో ఎడారి ప్రాంతాల్లో ఒంటెలపై ప్రయాణిస్తూ విద్యార్థులను చేరుకుంటున్నారు. రాజస్థాన్‌లో సుమారు 75 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో చాలామందికి స్మార్ట్‌ఫోన్లు లేవు. కాబట్టి 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఇళ్లకు వారానికి ఒకసారి వెళ్లాలని ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా 9నుంచి 12వ తరగతుల వారి ఇళ్లకు రెండుసార్లు వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే వారు ఒంటెలపై వెళ్లి విద్యార్థులను కలుస్తున్నారని అధికారులు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని