Sedition: ఐదేళ్లలో 326 రాజద్రోహం కేసులు

బ్రిటిష్‌ కాలం నాటి వివాదాస్పద రాజద్రోహం చట్టం కింద 2014-19 మధ్య కాలంలో దేశంలో

Published : 19 Jul 2021 14:11 IST

ఆరు సందర్భాల్లోనే అభియోగాల రుజువు

దిల్లీ: బ్రిటిష్‌ కాలం నాటి వివాదాస్పద రాజద్రోహం చట్టం కింద 2014-19 మధ్య కాలంలో దేశంలో మొత్తం 326 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆరింట్లో మాత్రమే అభియోగాలు రుజువు కావడం గమనార్హం. కేంద్ర హోం శాఖ గణాంకాల ప్రకారం.. 2014-19 మధ్య రాజద్రోహం చట్టం కింద 54 కేసులతో అస్సాం తొలిస్థానంలో నిలిచింది. 141 కేసుల్లో అభియోగపత్రం దాఖలు చేయగా, ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకు కేవలం ఆరు సందర్భాల్లో శిక్షలు పడ్డాయి. మరోవైపు, 2020 గణాంకాలు ఇంకా సిద్ధం కాలేదని కేంద్ర హోం శాఖ అధికారులు పేర్కొన్నారు. అస్సాంలో నమోదైన 54 కేసుల్లో 26 కేసులకు సంబంధించి అభియోగపత్రాలు దాఖలవగా, 25 కేసుల్లో విచారణ ముగిసింది. ఏ ఒక్క కేసులోనూ ఆరోపణలు రుజువు కాలేదు. ఇక ఈ జాబితాలో ఝార్ఖండ్‌ (40 కేసులు), హరియాణా (31 కేసులు)లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని