కొత్త అవతారంలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తేజస్‌ తరహా స్మార్ట్‌ కోచ్‌లతో  భారతీయ రైల్వే ఆధునికీకరిస్తోంది.

Published : 20 Jul 2021 12:56 IST

తేజస్‌ తరహా బోగీలతో ముస్తాబు 

దిల్లీ: రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తేజస్‌ తరహా స్మార్ట్‌ కోచ్‌లతో  భారతీయ రైల్వే ఆధునికీకరిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మక ముంబయి-దిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌.. కొత్త కోచ్‌లతో సోమవారం ముంబయి నుంచి ప్రయాణించింది. సెన్సర్‌ ఆధారంగా పనిచేసే ఈ కోచ్‌లలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి కోచ్‌లోనూ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. రాత్రి పూట కూడా ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి. 24 గంటల లైవ్‌ రికార్డింగ్‌ సదుపాయం ఉంటుంది. సీట్లకు మంటలు అంటుకోవు. సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించారు. ప్రతీ సీటుకు మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింటు ఉంటుంది. పైబెర్తుకు సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కోచ్‌ల్లో తలుపులు ఆటోమేటిగ్గా పనిచేస్తాయి. రైలు కదిలేవరకు మూసుకోవు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు