UP: తండ్రిని బెదిరించి రూ.కోటి డిమాండ్‌ చేసిన 11 ఏళ్ల బాలిక

తండ్రిని వాట్సప్‌ ద్వారా బెదిరించి ఏకంగా రూ.కోటి డిమాండ్‌ చేసింది ఓ 11 ఏళ్ల బాలిక.

Published : 01 Aug 2021 11:16 IST

గాజియాబాద్‌: తండ్రిని వాట్సప్‌ ద్వారా బెదిరించి ఏకంగా రూ.కోటి డిమాండ్‌ చేసింది ఓ 11 ఏళ్ల బాలిక. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. శాలిమార్‌ గార్డెన్‌ ఏరియాకు చెందిన 11 ఏళ్ల బాలికను తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన బాలిక.. తండ్రి ల్యాప్‌టాప్‌ నుంచే ఆయనకు సందేశం పంపింది. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. లేదంటే ఆయన కుమారుడు, కుమార్తెను చంపేస్తానని బెదిరించింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ సందేశం అతని ఇంట్లో నుంచే వచ్చిందని గుర్తించారు. దీంతో కంగుతిన్న ఫిర్యాదుదారుడు.. కూతురిని ప్రశ్నించారు. తిట్టడం వల్లే ఈ పని చేసినట్లు బాలిక అంగీకరించింది. అయితే ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు