Jammu and Kashmir: చొరబాటుకు సిద్ధంగా 140 మంది ఉగ్రవాదులు

భారత్‌-పాక్‌ల మధ్య ఓవైపు కాల్పుల విరమణ అమలవుతున్నప్పటికీ.. నియంత్రణ రేఖ పొడవునా

Updated : 06 Aug 2021 13:57 IST

కాల్పుల విరమణ ఉన్నా తీరు మారని పాక్‌

శ్రీనగర్‌: భారత్‌-పాక్‌ల మధ్య ఓవైపు కాల్పుల విరమణ అమలవుతున్నప్పటికీ.. నియంత్రణ రేఖ పొడవునా సుమారు 140 మంది ఉగ్రవాదులు జమ్మూ-కశ్మీర్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీనియర్‌ భద్రతాధికారి ఒకరు గురువారం తెలిపారు. అయితే సరిహద్దులో బలమైన రక్షణ వలయం ఉండటంతో ముష్కరుల ప్రయత్నాలు సాగడం లేదన్నారు. పలుమార్లు చొరబాటు ప్రయత్నాలు చేయగా.. మన సైనికుల అప్రమత్తత చూసి వెనక్కు మళ్లారని చెప్పారు. ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక కార్యదళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) ‘గ్రే’ జాబితాలో ఉన్న పాక్‌.. తదుపరి ఆంక్షల నుంచి బయటపడేందుకు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండి తీరాలి. అదే సమయంలో ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. అయితే పాక్‌ తీరు ఏమాత్రం మారలేదని, గత ఏడాది భారత్‌ సైన్యం కాల్పుల్లో దెబ్బతిన్న నిర్మాణాలను పునఃనిర్మించే పనిలో నిమగ్నమై ఉందని, ఇందుకు కాల్పుల విరమణను అవకాశంగా వాడుకుంటోందని ఆ అధికారి వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని