Updated : 06/08/2021 12:39 IST

Flu Vaccine: కొవిడ్‌ ప్రతికూలతలకు ఫ్లూ టీకాతో చెక్‌!

వాషింగ్టన్‌: కొవిడ్‌ బాధితుల్లో పక్షవాతం, రక్తం గడ్డ కట్టడం వంటి తీవ్ర ప్రతికూలతలు తలెత్తే అవకాశాలను తగ్గించే సామర్థ్యం ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ) టీకాకు ఉందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్నవారు ఐసీయూల్లో చేరే ముప్పు కూడా తక్కువేనని నిర్ధారించింది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఇజ్రాయెల్, సింగపూర్‌ సహా పలు దేశాలకు చెందిన 37,377 మందిపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మియామి మిల్లర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఏటా ఫ్లూ టీకా తీసుకునేవారితో పోలిస్తే.. దాన్ని వేయించుకోనివారు కొవిడ్‌ కారణంగా ఐసీయూల్లో చేరే ముప్పు 20% వరకు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వారిలో పక్షవాతం ముప్పు 58%, సెప్సిస్‌ ముప్పు 45% వరకు ఎక్కువగా ఉంటోందని నిర్ధారించారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని