India to UK flights: కొండెక్కిన టికెట్‌ ధరలకు కళ్లెం! 

భారత్‌-బ్రిటన్‌ మధ్య పరిమిత సంఖ్యలో ప్రత్యేక విమానాల రాకపోకల కారణంగా టికెట్‌ ధరలు

Updated : 13 Aug 2021 10:58 IST

భారత్‌-బ్రిటన్‌ మధ్య ఇకపై వారానికి 60 విమానాలు 

దిల్లీ: భారత్‌-బ్రిటన్‌ మధ్య పరిమిత సంఖ్యలో ప్రత్యేక విమానాల రాకపోకల కారణంగా టికెట్‌ ధరలు కొండెక్కుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం వారానికి 30 విమానాలనే అనుమతిస్తుండగా.. ఆ సంఖ్యను తాజాగా 60కి పెంచింది. కొత్త పరిమితి ఈ నెల 16 నుంచి అమల్లోకి వస్తుందని విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. దీనిప్రకారం భారత్‌-బ్రిటన్‌ మధ్య భారతీయ విమానయాన సంస్థలు 30 విమానాలను, బ్రిటన్‌ సంస్థలు మరో 30 విమానాలను ప్రతి వారం నడపనున్నాయి. మన దేశ కోటాలో ఉన్న 30లో.. ఎయిరిండియాకు 26, విస్తారాకు 4 కేటాయించారు. దిల్లీ-లండన్‌ మధ్య విమాన టికెట్‌ (ఎకానమీ తరగతి) ధర ఒక్కోటి రూ.1.2 లక్షల నుంచి రూ.3.95 లక్షల వరకు పలుకుతున్నట్లు వెలుగులోకి రావడం ఇటీవల కలకలం సృష్టించిన సంగతి గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని