Karnataka: అసలైన సర్పాలకే పూజలు

సాధారణంగా నాగుల చవితి.. నాగ పంచమి సందర్భంగా

Published : 14 Aug 2021 10:12 IST

ఉడుపి, న్యూస్‌టుడే: సాధారణంగా నాగుల చవితి.. నాగ పంచమి సందర్భంగా పుట్టకు పాలుపోయడం, నాగ దేవత విగ్రహాలకు పూజలు చేయడం చూస్తుంటాం. కర్ణాటకలోని ఉడుపి జిల్లా కాపు పట్టణానికి చెందిన గోవర్ధన్‌ భట్‌ అనే పాములు పట్టే నిపుణుడు మాత్రం అసలైన సర్పాలకే పూజలు చేస్తుంటారు. మూడు దశాబ్దాలుగా పాముల్ని బంధించి సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడుతున్న ఆయన.. ఇప్పటి వరకు వెయ్యి సర్పాలను రక్షించారు. శుక్రవారం నాగపంచమి సందర్భంగా రెండు నాగుపాములకు మంగళహారతులిచ్చి ప్రత్యేకంగా పూజించారు. తనకు ఏటా నిజమైన పాములకు పూజలు చేసే భాగ్యం లభిస్తోందని గోవర్ధన్‌ భట్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పూజలను అక్కడి వారు ఆసక్తిగా వీక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని