MP High court: బాలికలు సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరు!

భారతీయ బాలికలెవరూ సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 15 Aug 2021 12:49 IST

మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్య 

ఇండోర్‌: భారతీయ బాలికలెవరూ సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మకంగా చెబితే తప్ప, ఇలాంటి వాటికి అంగీకరించరంది. అలా సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా పర్యవసానాలను కూడా గమనించాలని తెలిపింది. ఉజ్జయినికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2018 అక్టోబరు నుంచి ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అయితే తాను వేరేవారిని పెళ్లి చేసుకుంటానని గత జూన్‌ నెలలో చెప్పడంతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. దీంతో పోలీసులు ఆ యువకునిపై అత్యాచారం కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. బెయిల్‌ కోసం దరఖాస్తు చేయగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌కు చెందిన జస్టిస్‌ సుబోధ్‌ అభయంకర్‌ విచారణ జరిపారు. ఆమెకు 21 ఏళ్లు నిండాయని, ఇష్టప్రకారమే సంబంధం పెట్టుకున్నామంటూ నిందితుడు చేసిన వాదనను అంగీకరించలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని