Updated : 21 Aug 2021 10:25 IST

Afghanistan: మాట నిలబెట్టుకున్న అమెరికా సైన్యం

ప్రత్యేక ఆపరేషన్‌తో అఫ్గాన్‌ పోలీస్‌ ఉన్నతాధికారి కుటుంబం సురక్షిత తరలింపు

వాషింగ్టన్‌: అమెరికా సైన్యం తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. తమకు ఎన్నో ఏళ్లుగా సహకరించిన అఫ్గానిస్థాన్‌కు చెందిన ఓ పోలీస్‌ ఉన్నతాధికారిని తాలిబన్ల కళ్లుగప్పి కాపాడింది. ‘ఆపరేషన్‌ ప్రామిస్‌ కెప్ట్‌’ పేరుతో బుధవారం పోలీస్‌ అధికారితో పాటు ఆయన కుటుంబసభ్యులనూ హెలికాప్టర్లో కాబుల్‌ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఆ అధికారి పేరు మహమ్మద్‌ ఖాలిద్‌ వర్దక్‌. ఆయన అఫ్గాన్‌లో అమెరికా సైనికులతో కలిసి చాలా ఏళ్లు పనిచేశారు. శత్రువులు తనపై జరిపిన గ్రెనేడ్‌ దాడిలో కాలు దెబ్బతింది. ఆ తర్వాత అమెరికా సాయంతో కృత్రిమ కాలు అమర్చుకుని మళ్లీ విధుల్లో చేరి అఫ్గాన్‌ పోలీసు దళాలను ముందుండి నడిపించారు. కానీ తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్నాక ఆయన పరిస్థితి తలకిందులైంది. ఆయన కనిపిస్తే చంపేందుకు వారు కాబుల్‌లో ప్రతి ఇల్లూ తిరిగి సోదాలు నిర్వహించారు. దీంతో తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఖలీద్‌ పలుమార్లు స్థావరం మార్చారు. ఇంతలో తనతో కలిసి పనిచేసిన అమెరికా సైన్యంలోని స్నేహితులు తనకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కుటుంబంతో సహా తాము చెప్పిన ప్రదేశానికి వస్తే సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే అడుగడుగునా తాలిబన్లు మోహరించి ఉన్నందున వారి కళ్లు గప్పి తప్పించుకోవడం ఖాలిద్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఎలాగైనా సరే తన వారిని బతికించుకోవాలనే సంకల్పంతో ఎవరికంటా పడకుండా దాక్కుంటూ ముందుకుసాగారు. తాలిబన్లు తమను పసిగట్టకుండా ఉండేందుకు కాబుల్‌లో ఒక చోటు నుంచి మరో చోటుకు మారారు. ఇలా నాలుగు సార్లు ప్రయత్నించి చివరకు బుధవారం అనుకున్న ప్రదేశానికి చేరుకున్నారు. అప్పుడు అమెరికా సైన్యం హెలికాప్టర్‌లో ఖాలిద్, ఆయన భార్య, నలుగురు పిల్లలను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ ఆపరేషన్‌ కోసం అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు, రక్షణ, విదేశాంగ శాఖ నుంచి సాయం కోరినట్లు అమెరికా ప్రత్యేక దళాల సర్జంట్‌ మేజర్‌ క్రిస్‌ గ్రీన్‌ వెల్లడించారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని