Published : 24/08/2021 13:37 IST

Joe Biden: బలగాల ఉపసంహరణ సరైన నిర్ణయమే

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ నుంచి తమ బలగాల ఉపసంహరణను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి సమర్థించుకున్నారు. సహేతుకమైన నిర్ణయంగా దాన్ని పేర్కొన్నారు. శ్వేతసౌధంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా సైనికులు వైదొలుగుతుండటంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తమ బలగాల ఉపసంహరణ.. సరైన, సహేతుక నిర్ణయంగా చరిత్రలో నిలుస్తుందన్నారు. అఫ్గాన్‌ ప్రజల సంక్షేమం కోసం కృషిచేయాలా వద్దా అన్న సంగతిని ఇకపై తాలిబన్లే తేల్చుకోవాలని పేర్కొన్నారు. దేశ ఐక్యత కోసం పనిచేయాలంటే వారికి ఆర్థిక, వాణిజ్యం సహా పలు రంగాల్లో ఇతర దేశాల సహకారం అవసరమవుతుందని చెప్పారు. విదేశాలతో దౌత్య సంబంధాలను కొనసాగించాలనే కోరుకుంటున్నట్లు ప్రస్తుతానికి తాలిబన్లు చెబుతున్న సంగతిని గుర్తుచేశారు. గత కొన్నాళ్లుగా వారు అమెరికా బలగాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని.. పౌరుల తరలింపు ప్రక్రియకు అడ్డంకులు సృష్టించడం లేదని తెలిపారు.  

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని