Vehicle Insurance: 1 నుంచి ‘బంపర్‌ టు బంపర్‌’ బీమా తప్పనిసరి

వచ్చే నెల 1వ తేదీ నుంచి విక్రయించే అన్ని కొత్త వాహనాలకు బంపర్‌ టు బంపర్‌ ప్రాతిపదికన వాహన యజమాని, డ్రైవరు, ప్రయాణికులందరినీ కలిపేలా

Updated : 27 Aug 2021 10:00 IST

మద్రాసు హైకోర్టు ఆదేశాలు

చెన్నై, న్యూస్‌టుడే: వచ్చే నెల 1వ తేదీ నుంచి విక్రయించే అన్ని కొత్త వాహనాలకు బంపర్‌ టు బంపర్‌ ప్రాతిపదికన వాహన యజమాని, డ్రైవరు, ప్రయాణికులందరినీ కలిపేలా ఐదేళ్ల బీమాను తప్పనిసరి చేయాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. హొగినేకల్‌లో 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సడయప్పన్‌ మృతి చెందారు. నష్టపరిహారం కోరుతూ కుటుంబ సభ్యులు ఈరోడ్‌ మోటారు వాహన ప్రమాద పరిహార ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. ట్రైబ్యునల్‌ సడయప్పన్‌ కుటుంబానికి రూ.14,65,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు న్యాయమూర్తి జస్టిస్‌ వైద్యనాథన్‌ సమక్షంలో గురువారం విచారణకు వచ్చింది. వాహన డ్రైవరు, యజమాని అనే ప్రాతిపదికన మాత్రమే వాహనానికి బీమా చేశారని.. డ్రైవరు కాని వ్యక్తి మృతి చెందితే రూ.లక్ష మాత్రమే చెల్లిస్తామని బీమా సంస్థ తెలిపింది. సడయప్పన్‌ ప్రమాద సమయంలో వాహనం నడపలేదని పేర్కొంది. అంగీకరించిన న్యాయమూర్తి ఈరోడ్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలను రద్దు చేశారు. కోర్టు ఆదేశాలను బీమా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ రవాణాశాఖ అదనపు కార్యదర్శి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని