భార్యతో బలవంతపు శృంగారం.. అత్యాచారం కాదు

భార్యతో బలవంతపు శృంగారం చేసినా దాన్ని అత్యాచారంగా పరిగణించబోమని చత్తీస్‌గఢ్‌ హైకోర్టు తెలిపింది.

Updated : 27 Aug 2021 10:04 IST

ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పు

బిలాస్‌పుర్‌: భార్యతో బలవంతపు శృంగారం చేసినా దాన్ని అత్యాచారంగా పరిగణించబోమని చత్తీస్‌గఢ్‌ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు భారత శిక్షాస్మృతి 376వ అధికరణ కింద దాఖలైన అభియోగాల నుంచి 37 ఏళ్ల వ్యక్తిని విముక్తి చేసింది. అయితే అతనిపై 377 అధికరణ కింద నమోదైన అసహజ నేరాలతో పాటు ఇతర అభియోగాలు కొనసాగుతాయని పేర్కొంది.  చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య వయసు 18 ఏళ్లు లోపు లేకపోతే.. బలవంతంగా శృంగారం చేసినా అది నేరం కిందకు రాదని 376వ అధికరణలోని రెండో మినహాయింపు స్పష్టంగా చెబుతోందని న్యాయమూర్తి తెలిపారు. అందుకే ఆ అభియోగాల నుంచి విముక్తి కల్పించినట్లుపేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని