Afghanistan: టీవీల్లో ఆకట్టుకునే ఉపన్యాసాలు.. క్షేత్రస్థాయిలో హింస!

త్వరలో ఏర్పాటయ్యే తాలిబన్‌ ప్రభుత్వం మహిళల హక్కులను పరిరక్షించాలని అఫ్గాన్‌ మహిళలు

Published : 03 Sep 2021 12:01 IST

తాలిబన్లపై విరుచుకుపడ్డ అఫ్గాన్‌ మహిళలు

కాబుల్‌: త్వరలో ఏర్పాటయ్యే తాలిబన్‌ ప్రభుత్వం మహిళల హక్కులను పరిరక్షించాలని అఫ్గాన్‌ మహిళలు డిమాండ్‌ చేశారు. పశ్చిమ హెరాత్‌ రాష్ట్రంలోని గవర్నర్‌ కార్యాలయం ఎదుట గురువారం కొందరు మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొత్త ప్రభుత్వంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని... క్యాబినెట్‌లోనూ, పెద్దల సభలోనూ అవకాశాలు ఇవ్వాలని ప్రదర్శనకు నేతృత్వం వహించిన ఫ్రిబా కబ్జానీ డిమాండ్‌ చేశారు. ‘‘తాలిబన్లు టీవీల్లో అందమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం హింసకు పాల్పడుతూనే ఉన్నారు. మహిళలపై వారు మళ్లీ దాడి చేశారు. అందుకు మేమే ప్రత్యక్ష సాక్షులం. మా నోళ్లు మూయించాలని వారు ఎంతో ప్రయత్నిస్తున్నారు. కానీ, మేము మౌనంగా కూర్చోం. మా హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం ’’ అని ఉద్యమకారిణులు చెప్పారు.

అమెరికా హామీ నిలబెట్టుకోలేదు

అమెరికా బొంకింది... మమ్మల్ని మోసగించింది... తీసుకెళ్తామని అభయమిచ్చి, చెప్పాపెట్టకుండానే చివరి విమాన ప్రయాణాన్ని ముగించింది... అంటూ కాబుల్‌లో నిలిచిపోయిన వందల మంది అమెరికన్‌ గ్రీన్‌కార్డుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.

 కాబుల్‌లో మళ్లీ విమాన చప్పుడు!

అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌లో ఉన్న హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ విమాన చప్పుడు వినిపించింది. కతార్‌ సైనిక విమానమొకటి ఇక్కడ దిగిన దృశ్యాన్ని తాలిబన్‌ మీడియా ప్రతినిధి అహ్మదుల్లా ముత్తాఖి గురువారం ట్విటర్‌లో పోస్టు చేశారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా గత సోమవారం తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్న తర్వాత... కాబుల్‌ విమానాశ్రయం ఒక్కసారిగా స్తబ్దుగా మారిపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని