Delta Variant: డెల్టా జోరుకు ఇవే కారణాలు..
భారత్ సహా అనేక దేశాల్లో వెలుగు చూసిన కరోనా కేసుల్లో సింహభాగాన్ని ఆక్రమించిన డెల్టా వేరియంట్‌కు నిర్దిష్టంగా ఈ జోరు ఎక్కడి నుంచి వచ్చిందన్నది శాస్త్రవేత్తలు నిర్ధరించారు...
అధిక సాంక్రమిక శక్తి, రోగ నిరోధక వ్యవస్థకు టోపీ
దిల్లీ: భారత్ సహా అనేక దేశాల్లో వెలుగు చూసిన కరోనా కేసుల్లో సింహభాగాన్ని ఆక్రమించిన డెల్టా వేరియంట్‌కు నిర్దిష్టంగా ఈ జోరు ఎక్కడి నుంచి వచ్చిందన్నది శాస్త్రవేత్తలు నిర్ధరించారు. యాంటీబాడీలను ఏమార్చే సామర్థ్యం, అధిక సాంక్రమిక శక్తి కారణంగా దీని ఉద్ధృతి పెరిగినట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తేల్చింది. ల్యాబ్‌లో ప్రయోగాలు నిర్వహించడంతోపాటు, టీకా పొందాక కూడా ఇన్ఫెక్షన్ బారినపడిన వారి తీరుతెన్నులను పరిశీలించింది. ఇందుకోసం గతంలో కరోనా బారినపడటం లేదా ఆస్ట్రాజెనెకా/ ఫైజర్ టీకాలను పొందిన వ్యక్తుల నుంచి సేకరించిన సీరంను పరిశోధకులు పరిశీలించారు. ఇందులో యాంటీబాడీలు ఉంటాయి. డెల్టా వేరియంట్‌పై.. మునుపటి ఇన్ఫెక్షన్ వల్ల కలిగిన యాంటీబాడీలు 5.7 రెట్లు తక్కువగా, టీకా వల్ల ఉత్పత్తయిన యాంటీబాడీలు 8 రెట్లు తక్కువగా సున్నితత్వాన్ని చూపాయని శాస్త్రవేత్తలు వివరించారు. వ్యక్తుల్లో ప్రస్తుతమున్న రోగ నిరోధక రక్షణను ఏమార్చడంలో డెల్టా వేరియంట్ సమర్థతను చాటుతున్నట్లు ఈ పరిశోధనలో పాల్గొన్న పార్థా రక్షిత్ చెప్పారు. శరీరంలోకి ప్రవేశించాక ఈ రకం వైరస్ చాలా వేగంగా తన ప్రతులను పెంచుకుంటున్నట్లు కూడా తేల్చారు. ఇతర వేరియంట్ల కన్నా ఇది వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ‘‘భారత్‌లో కొవిడ్ రెండో ఉద్ధృతికి ఈ అంశాలు కారణమై ఉండొచ్చు. ఆ సమయంలో వెలుగు చూసినవాటిలో సగం కేసులు.. అంతకుముందు ఇతర వేరియంట్లతో ఇన్ఫెక్ట్ అయినవారే’’ అని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన రవీంద్ర గుప్తా పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Pak Cricket: భారత్ మోడల్‌కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్‌కు మాజీ ప్లేయర్ సూచన
-
General News
Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వైద్యులు
-
Movies News
Yash: రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. హృతిక్ వద్దంటే.. యశ్ అడుగుపెడతారా?
-
India News
Gorakhnath: గోరఖ్‌నాథ్ ఆలయంలో దాడి.. ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష
-
Politics News
KTR: రాజ్‌భవన్‌లో రాజకీయ నాయకుల ఫొటోలు సరికాదు: కేటీఆర్
-
Crime News
TS news: ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి.. దిల్లీ ముఠా మోసాలు