Train Coaches Lease: లీజుకు రైలు బోగీలు.. ఆసక్తి ఉన్నవారు కొనుక్కోవచ్చు 

ఇప్పటివరకు రైళ్లను అద్దెకు (లీజుకు) ఇచ్చిన రైల్వేశాఖ ఇప్పుడు బోగీలను అద్దెకు ఇచ్చే వినూత్న ప్రయత్నం మొదలుపెట్టింది.

Updated : 12 Sep 2021 15:16 IST

రైల్వే శాఖ సన్నాహాలు

ఈనాడు, దిల్లీ: ఇప్పటివరకు రైళ్లను అద్దెకు (లీజుకు) ఇచ్చిన రైల్వేశాఖ ఇప్పుడు బోగీలను అద్దెకు ఇచ్చే వినూత్న ప్రయత్నం మొదలుపెట్టింది. ఆసక్తి ఉన్న ఎవరైనా బోగీలను అద్దెకు తీసుకొని, వాటిని తమ ఆసక్తికి అనుగుణంగా తీర్చిదిద్దుకుని ఉపయోగించుకొనే కొత్త పద్ధతికి శ్రీకారం చుడుతున్నట్లు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త విధానంలో ఆసక్తిగల వారికి అనువైన రీతిలో బోగీలను తీర్చిదిద్ది అద్దెకు ఇస్తారు. లేదంటే శాశ్వతంగానూ కొనుగోలు చేసుకోవచ్చు. బోగీ లీజు కాలపరిమితి కనీసం అయిదేళ్లు. తర్వాత ఆ లీజును దాని జీవితకాలం వరకు పొడిగించవచ్చు. రూట్లు, టారిఫ్‌ నిర్ణయాధికారం అద్దెకు తీసుకున్న వారికే ఉంటుంది. ఈ బోగీలను సాంస్కృతిక, మతపరమైన, ఇతర పర్యాటక సర్క్యూట్‌ రైళ్లుగా నడపొచ్చని రైల్వేశాఖ అభిప్రాయపడింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని