NCW: చీర ధరించిన మహిళకు ప్రవేశ నిరాకరణ.. మహిళా కమిషన్‌ ఆగ్రహం

చీర ధరించి వచ్చిన మహిళను లోపలికి అనుమతించని దిల్లీలోని ఓ రెస్టారెంటు వ్యవహారంపై దర్యాప్తు జరపాలని

Published : 24 Sep 2021 13:42 IST

దిల్లీలోని రెస్టారెంటుకు సమన్లు 

దిల్లీ: చీర ధరించి వచ్చిన మహిళను లోపలికి అనుమతించని దిల్లీలోని ఓ రెస్టారెంటు వ్యవహారంపై దర్యాప్తు జరపాలని దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ను జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఆదేశించింది. ఆ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలనీ సూచించింది. ఈ నెల 28న తమ ఎదుట హాజరుకావాలని ఆ రెస్టారెంట్‌ మార్కెటింగ్, ప్రజాసంబంధాల డైరెక్టర్‌కు నోటీసు జారీ చేసింది. ‘భారతీయ సంస్కృతిలో చీర ఓ భాగం. భారతీయ మహిళల్లో అత్యధిక మంది చీరను ధరిస్తారు. వస్త్రధారణ ఆధారంగా మహిళలను రెస్టారెంటులోకి ప్రవేశించనీయకపోవడం గౌరవప్రదంగా జీవించే ఆమె హక్కుకు విఘాతం కలిగించినట్లే’నని ఎన్‌సీడబ్ల్యూ ఒక ప్రకటనలో పేర్కొంది. గౌరవప్రద వస్త్రధారణ జాబితాలో చీరకట్టును చేర్చని రెస్టారెంట్‌ విధానాలను, సిబ్బంది ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కమిషన్‌ తెలిపింది. దిల్లీలోని రెస్టారెంటులో ఆదివారం జరిగిన ఘటనను బాధిత మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అది విస్తృత ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని