New Pamban Bridge: కొత్త పంబన్‌ బ్రిడ్జి అద్భుత చిత్రాలను చూశారా?

భారతదేశపు తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జి, తమిళనాడులోని రామేశ్వరంలోని ‘‘న్యూ పంబాన్‌ బ్రిడ్జి’’ని 2022 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

Published : 07 Oct 2021 01:12 IST

దేశంలో ఇదే తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జి

దిల్లీ: భారతదేశపు తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జి, తమిళనాడులోని రామేశ్వరంలోని ‘‘న్యూ పంబన్‌ బ్రిడ్జి’’ని 2022 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొత్త పంబన్‌ బ్రిడ్జి నిర్మాణపనుల చిత్రాలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. మార్చి 2019లో ఈ కొత్త పంబన్‌ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేయగా.. ఈ బ్రిడ్జి నిర్మాణపనులు 2019 నవంబరు9న ప్రారంభమైయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి సుమారు రూ.250కోట్లు వెచ్చింది.  104ఏళ్ల చరిత్ర గల ఈ బ్రిడ్జి.. బంగాళా ఖాతంలోని పంబన్‌ దీవికి, దేశానికి అనుసంధానంగా ఉంటుంది. 63మీట్లరు పొడవైన ఈ బ్రిడ్జి.. పడవలు, ఓడలు వెళ్లే సమయంలో పైకి లిఫ్ట్‌ చేసేవిధంగా ఏర్పాటు చేశారు. ఇది కనుక  అందుబాటులోకి వస్తే.. రామేశ్వరానికి రైళ్లను అధికవేగంతో నడిపేందుకు.. అలాగే అధిక బరువు ఉన్నలోడ్‌ను తీసుకెళ్లేందుకు సహాయపడుతుంది. కాగా పాత పంబన్‌ బ్రిడ్జిని 1914లో అందుబాటులోకి తీసుకురాగా... ఆ బ్రిడ్జి నిర్మాణం మూడేళ్లలో పూర్తిచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని