Hacking: హ్యాకింగ్‌లో అధిక వాటా రష్యాదే 

అమెరికా ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకొని రష్యా ఎక్కువగా హ్యాకింగ్‌కు పాల్పడుతోందని దిగ్గజ సాంకేతిక కంపెనీ

Published : 08 Oct 2021 14:07 IST

తాజా నివేదికలో మైక్రోసాఫ్ట్‌ వెల్లడి 

బోస్టన్‌: అమెరికా ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకొని రష్యా ఎక్కువగా హ్యాకింగ్‌కు పాల్పడుతోందని దిగ్గజ సాంకేతిక కంపెనీ మైక్రోసాఫ్ట్‌ ఓ నివేదికలో వెల్లడించింది. గత ఏడాది జులై నుంచి ఈ ఏడాది జూన్‌ మధ్య తాము గుర్తించిన హ్యాకింగ్‌ కార్యకలాపాల్లో 58%.. రష్యా ప్రభుత్వ ప్రాయోజితమైనవేనని తెలిపింది. అమెరికా తర్వాత అధికంగా ఉక్రెయిన్, బ్రిటన్, నాటోలోని ఐరోపా సభ్య దేశాలను ఆ దేశ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంది. డిజిటల్‌ రక్షణ వార్షిక నివేదికలో ఈ మేరకు పలు కీలక విషయాలను వెల్లడించింది. రష్యా మద్దతున్న హ్యాకర్లు తమ కార్యకలాపాల్లో 32% వరకు విజయవంతమవుతున్నారని తెలిపింది. తాము గుర్తించిన హ్యాకింగ్‌ ప్రక్రియల్లో చైనా ప్రాయోజితమైనవి 8% ఉన్నాయని వెల్లడించింది. అంతకుముందు ఏడాది ఆ దేశం వాటా 12%గా ఉన్న సంగతిని గుర్తుచేసింది. అమెరికా హ్యాకింగ్‌ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను నివేదికలో పేర్కొనలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని