
Published : 08 Oct 2021 14:32 IST
Acid Attack: యాసిడ్ దాడి బాధితురాలికి రూ.10 లక్షలు ఇవ్వండి
మహారాష్ట్ర సర్కారుకు బాంబే హైకోర్టు సూచన
ముంబయి: యాసిడ్ దాడి బాధితులు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబులిటీస్ చట్టం ప్రకారం.. పరిహారానికి, పునరావాసానికి అర్హులని పేర్కొన్న బాంబే హైకోర్టు నగరానికి చెందిన ఓ బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం మూడు నెలల్లోపు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మాధవ్ జమదార్‌ల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ.. పరిహారం చెల్లించడంతోపాటు మళ్లీ ఆమె ముఖం మునుపటిలా మారేందుకు చేయించకునే శస్త్రచికిత్స ఖర్చులు, ఇతర వైద్యపరమైన అవసరాలు భరించాలని పేర్కొంది. 2010లో భర్త చేతిలో దాడికి గురైన ఇద్దరు పిల్లల తల్లి అయిన ఓ మహిళ దరఖాస్తు విచారణ సందర్భంగా హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది.
Tags :