Crime News: కదులుతున్న రైలులో యువతిపై సామూహిక అత్యాచారం

మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోకి ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల

Published : 10 Oct 2021 11:36 IST

మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోకి ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు, నగలు దోచుకోవడమే కాకుండా.. 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లఖ్‌నవూ నుంచి ముంబయికి వెళ్తున్న పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు శుక్రవారం రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇగత్‌పురి, కాసారా రైల్వేస్టేషన్‌ మధ్య కొండలపై ప్రయాణించే క్రమంలో రైలు వేగం నెమ్మదించింది. ఆ సమయంలో 8 మంది దుండగులు రైలులోని డీ-2 బోగిలోకి ప్రవేశించారు. మారణాయుధాలను పట్టుకుని 10 నుంచి 20 మంది ప్రయాణికులను బెదిరించారు. వారి ఫోన్లు, నగలు, డబ్బులు లాక్కున్నారు. ఎదురుతిరిగిన ప్రయాణికులపై దాడి చేశారు. రైలులో ఉన్న ఓ 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

నలుగురి అరెస్టు..
రైలు కాసారా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక.. ప్రయాణికులు సహాయం కోసం గట్టిగా అరిచారని ముంబయి రైల్వే పోలీసు కమిషనర్‌ కైసర్‌ ఖలీద్‌ ట్విటర్‌లో తెలిపారు. ఆ సమయంలో స్పందించిన పోలీసు సిబ్బంది.. దుండగుల్లో నలుగురిని పట్టుకున్నారని చెప్పారు. ‘‘బాధితురాలిని వైద్య చికిత్స కోసం తరలించాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాం. నిందితులను మా బృందం ప్రశ్నిస్తోంది’’ అని మరో ట్వీట్‌లో ఖలీద్‌ తెలిపారు.  

మైనర్‌పై రెండేళ్లుగా  అఘాయిత్యం

14ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న 58 ఏళ్ల వ్యక్తిని ఝార్ఖండ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఝార్ఖండ్‌లోని సిమ్‌దేగా జిల్లాలోని ఓ గ్రామంలో రెండేళ్లుగా జరుగుతున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక తండ్రి కేరళలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి కూలిపనికి వెళుతోంది. ఇదే అదునుగా భావించిన పొరుగింటి వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంగతి ఇటీవలే తనకు తెలిసిందని బాలిక తల్లి పోలీసులకు తెలిపింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని